News August 6, 2024

ప్లాస్టిక్ బాటిల్‌‌లో నీరు తాగుతున్నారా? జాగ్రత్త!

image

ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగడం ప్రమాదకరమని ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా హెచ్చరించారు. ఆ బాటిల్స్‌లో సూక్ష్మస్థాయిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు రక్తంలోకి ప్రవేశించి బీపీని పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. హార్మోన్ల అసమతుల్యత, హృద్రోగ సమస్యలతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.

Similar News

News March 24, 2026

అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: CBN

image

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక వాటి వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తోంది’ అని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 24, 2026

ALERT: పెట్రోల్ కొట్టిస్తున్నారా?

image

బంకుల్లో ఇంధనం కొట్టిస్తున్నప్పుడు చాలా మంది రీడింగ్ సున్నా ఉందో చెక్ చేస్తుంటారు. అయితే ఇంధన డెన్సిటీ చెక్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ డెన్సిటీ 720 – 775kg/m³, డీజిల్ 820 – 860kg/m³ మధ్య ఉండాలి. ఇది తక్కువగా ఉంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు అర్థం. ఈ ఇంధనం మైలేజీని తగ్గించడమే కాకుండా ఇంజిన్‌ను దెబ్బతీస్తుంది. అందుకే తప్పనిసరిగా ‘Density’ డిస్‌ప్లేలో చెక్ చేయండి. share it

News March 24, 2026

శివలీల.. పసుపు వేస్తే కుంకుమ అవుతుంది!

image

TG: హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయం అద్భుత ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడి శివలింగంపై రాత్రి వేళ భక్తితో పసుపు వేస్తే ఉదయానికి అది కుంకుమగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఇది ఆ మహాశివుడి లీలతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమని నమ్మకం. కాకతీయుల కాలం నాటి ఈ పురాతన దేవాలయంలోని ఈ వింతను చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(29/100)