News August 6, 2024
WOW: నడిస్తే కరెంటు ఉత్పత్తి అయ్యే షూ

ఆర్మీ కోసం IIT ఇండోర్ స్పెషల్ షూ రూపొందించింది. TENG టెక్నాలజీ వల్ల నడుస్తుంటే విద్యుత్ ఉత్పత్తి జరిగి సోల్‌లోని ఒక డివైజులో స్టోర్ అవుతుంది. దీన్ని వాడుకోవచ్చు. GPSతో రియల్ టైమ్ లొకేషన్ గుర్తించొచ్చు. ఇవి భద్రతతో పాటు జవాన్ల మధ్య సమన్వయం పెంచుతాయి. ఇప్పటికే 10 జతలను DRDOకు పంపించారు. ఈ షూ వేసుకోవడం వల్ల అల్జీమర్స్ బాధితులు, విద్యార్థుల లొకేషన్ తెలుసుకోవచ్చు. ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవచ్చు.
Similar News
News March 19, 2026
విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఊరట.. ఎల్పీజీ సరఫరా పునఃప్రారంభం

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ సరఫరా తిరిగి ప్రారంభమైంది. వారం రోజుల అంతరాయంతో ఉత్పత్తిపై ఆందోళన నెలకొంది. స్టీల్ మెల్టింగ్ షాప్‌లో కంటిన్యూస్ కాస్టింగ్ మెషీన్స్ (CCM)లకు రోజుకు 12-13 టన్నుల ఎల్పీజీ అవసరం. ప్లాంట్‌లోని 325 టన్నుల సామర్థ్యం ఉన్న ట్యాంకుల్లో నిల్వలు 75 టన్నులకు తగ్గాయి. యాజమాన్యం, యూనియన్ల ఒత్తిడితో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరఫరా నిన్నటి నుంచి పునఃప్రారంభం అయ్యింది.
News March 19, 2026
పరాభవ నామ సంవత్సరం.. శుభ ముహూర్తాలు

* చైత్ర మాసం- మార్చి 27, 28
* వైశాఖ మాసం- ఏప్రిల్ 26, 29, మే 1, 3, 6-11
* నిజ జ్యేష్ఠ మాసం: జూన్ 17-జులై9
* శ్రావణ మాసం: ఆగస్టు 15, 16, 20, 22
* కార్తీక మాసం: నవంబర్ 12-22,
* మాఘ మాసం: 2027 ఫిబ్రవరి 7-27
* ఫాల్గుణ మాసం: మార్చి 10-ఏప్రిల్ 2
* గురు మౌఢ్యమి: జులై 15- ఆగస్టు 15, శుక్ర మౌఢ్యమి: అక్టోబర్ 19-29 వరకు ముహూర్తాలు లేవు.#ShareIt
News March 19, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.


