News August 6, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.

Similar News

News March 14, 2026

దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

image

భారత దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌‌కు BCCI ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రకటించింది. రేపు ఢిల్లీలో జరిగే నమన్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవంలో వీరిని సత్కరించనుంది. ఈ ముగ్గురినీ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో గౌరవించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ప్లేయర్లు కనబరిచిన అసామాన్య ప్రతిభను గుర్తిస్తూ ఏటా నమన్ అవార్డుల ప్రదానం జరుగుతుంది.

News March 14, 2026

4 రోజులుగా ICUలో తమ్మినేని వీరభద్రం

image

TG: CPI(M) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం గత 4 రోజులుగా గచ్చిబౌలి (HYD) AIG హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు BV.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఇతర నాయకులు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.

News March 14, 2026

ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ

image

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని PM మోదీ తెలిపారు. ఇలాంటి సందర్భంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ ‘దేశ ప్రయోజనాల విషయంలో INC మళ్లీ విఫలమైంది. నాపై దుర్భాషలాడేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. దేశాభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోంది’ అని పేర్కొన్నారు.