News August 6, 2024
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్

AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
Similar News
News November 11, 2025
కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.
News November 11, 2025
బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
☞ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS: 41%, BJP: 06%
☞ పబ్లిక్ పల్స్- కాంగ్రెస్: 48%, BRS: 41%, BJP: 06%
☞ స్మార్ట్ పోల్- కాంగ్రెస్: 48.2%, BRS: 42.1%
☞ నాగన్న సర్వే- కాంగ్రెస్: 47%, BRS: 41%, BJP: 08%
☞ జన్‌మైన్, HMR సర్వేలూ కాంగ్రెస్‌దే గెలుపు అంటున్నాయి.


