News August 6, 2024
విమానంలోకి కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లొచ్చా?

ఎండిన కొబ్బరి కాయ, కుడకలు(కొబ్బరి ముక్కల) విమానంలోని క్యాబిన్ బ్యాగేజ్‌లోకి సిబ్బంది అనుమతించరు. వాటికి మండే స్వభావమే ఇందుకు కారణం. అలాగే కొబ్బరి ప్రసాదాన్ని కూడా క్యాబిన్ బ్యాగేజ్‌లోకి అనుమతించరు. అయితే చెక్ ఇన్ లగేజ్‌లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. క్యాబిన్ బ్యాగేజ్ అంటే ఫ్లైట్‌లో ప్రయాణికులతో పాటు ఉంచుకునేది. చెక్ ఇన్ లగేజ్ అంటే సిబ్బందికి అప్పగించి, బెల్ట్ వద్ద తీసుకునేది.
Similar News
News January 15, 2026
ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
News January 15, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 15, 2026
APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<


