News August 6, 2024
డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్?

అమెరికా అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించిన డెమోక్రాటిక్ పార్టీ తాజాగా ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను కమలా ఖరారు చేసినట్లు CNN పేర్కొంది. ఈనెల 19న చికాగోలో జరిగే జాతీయ సమావేశంలో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో NOVలో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, JD వాన్స్‌తో కమలా హారిస్, వాల్జ్ తలపడే ఛాన్స్ ఉంది.
Similar News
News November 3, 2025
ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.
News November 3, 2025
₹లక్ష కోట్లతో రీసెర్చ్ ఫండ్.. ప్రారంభించిన మోదీ

టెక్ రెవల్యూషన్‌కు భారత్ సిద్ధంగా ఉందని PM మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ESTIC-2025 కాంక్లేవ్‌ను ప్రారంభించారు. ₹లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ (RDI) స్కీమ్ ఫండ్‌ను లాంచ్ చేశారు. ‘ఈ ₹లక్ష కోట్లు మీకోసమే. మీ సామర్థ్యాలను పెంచేందుకు, కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఉద్దేశించినవి. ప్రైవేటు సెక్టార్‌లోనూ రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
News November 3, 2025
ఆటిజంకు చికిత్స ఇదే..

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.


