News August 6, 2024
నాగార్జున సాగర్‌కు ప్రత్యేక బస్సులు

నాగార్జునసాగర్ గేట్లు తెరవడంతో ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ MGBS బస్టాండ్ నుంచి నేరుగా సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ సర్వీసులు ఉదయం 5, 6.45, 7.15, 7.30, 8, 9.45, 10.45 గంటలకు.. తర్వాత మధ్యాహ్నం 2.30, సాయంత్రం 5, 5.40 గంటలకు డీలక్స్ బస్సులు MGBS బస్టేషన్ నుంచి నేరుగా సాగర్‌కు వెళ్తాయని అధికారులు తెలిపారు.
Similar News
News March 3, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. ఉగాది తర్వాతే..!

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 4.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.
News March 3, 2026
నల్గొండ: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘ఇన్‌ఛార్జీ’ల రాజ్యం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని 15 కార్యాలయాల్లో సగానికి పైగా చోట్ల రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేరు. మునుపెన్నడూ లేని విధంగా సిబ్బంది కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లే ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు డీఆర్‌లు సైతం ఎఫ్ఏసీలే కావడం గమనార్హం.
News March 2, 2026
NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.


