News August 6, 2024

కంపెనీకి గుడ్‌బై చెప్పనున్న ‘అమెజాన్ ఇండియా’ హెడ్?

image

ఇండియాలో ‘అమెజాన్’ వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించిన కంట్రీ హెడ్ మనీశ్ తివారీ కంపెనీని వీడనున్నట్లు ‘రాయిటర్స్’ పేర్కొంది. ‘యునిలీవర్‌’ కంపెనీ నుంచి నిష్క్రమించిన తర్వాత 2016లో ఆయన అమెజాన్ ఇండియాలో చేరారు. అత్యంత పోటీ కలిగిన ఇ-కామర్స్ మార్కెట్‌లో కంపెనీ కార్యకలాపాలు విస్తరించేలా కృషి చేసి ‘అమెజాన్’ విజయానికి దోహదపడ్డారు.

Similar News

News March 3, 2026

బోసిపోయిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్.. కేవలం 20 విమానాలే..

image

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యుద్ధ ప్రభావంతో బోసిపోయింది. మార్చి 2న ‘ఫ్లైట్ రాడార్24’ ట్రాకింగ్ ప్రకారం 20 విమానాలు మాత్రమే ఈ విమానాశ్రయంలో రాకపోకలు సాగించాయి. అందులో 16 టేకాఫ్ కాగా 4 ల్యాండ్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి రోజుకు 1,200కు పైగా విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతాయి. ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే విమానాలకు ఇదే కనెక్టింగ్ పాయింట్.

News March 3, 2026

BPSCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్(BPSCL)15 అసిస్టెంట్ మేనేజర్(బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్ సర్టిఫికెట్ కలిగినవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bpscl.com

News March 3, 2026

అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావొద్దు: సామ్ కరన్

image

T20WC: ఎల్లుండి తమతో జరిగే <<19285865>>సెమీ ఫైనల్‌లో<<>> భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావొద్దని కోరుకుంటున్నట్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తెలిపారు. ‘ఇండియాకు మంచి లైనప్ ఉంది. అయినా మా ప్లాన్స్ మాకున్నాయి. కచ్చితంగా ఈ మ్యాచ్ అద్భుతంగా సాగుతుంది. మాకు ఇండియాలో ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడి పిచ్ కండీషన్స్ బాగా తెలుసు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.