News August 6, 2024
ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం: నారాయణ

AP: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న మున్సిపాలిటీల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా మరో 83 క్యాంటీన్లు, సెప్టెంబర్ నెలాఖరులోగా మరో 20 క్యాంటీన్లు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్యాంటీన్ల ద్వారా రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం అందించనుంది.
Similar News
News November 10, 2025
చలి పులి దెబ్బ: ఇంటింటా దగ్గు, జలుబు శబ్దాలే!

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
News November 10, 2025
దేశంలోనే శ్రీమంతురాలైన రోష్నీ నాడార్ గురించి తెలుసా?

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో 5స్థానంలో నిలిచిన రోష్నీ నాడార్‌కు సుమారు రూ. 2.84 లక్షల కోట్ల సంపద ఉంది. 27 ఏళ్లకే HCL CEO బాధ్యతలు చేపట్టిన ఆమె సంస్థను లాభాల బాట పట్టిస్తూ ధనిక మహిళల్లో ఒకరిగా ఎదిగారు. మరోవైపు సామాజిక సేవలోనూ ముందున్నారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ జాబితాల్లో చోటు దక్కించుకున్న ఆమె గతేడాది ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్ డె లా లీజియన్ డి-హానర్’ అందుకున్నారు.
News November 10, 2025
మొంథా తుఫాన్.. 1,64,505 హెక్టార్లలో పంట నష్టం

AP: మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 1,64,505 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 31వేల హెక్టార్లలో, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావిత 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం.. ఇవాళ, రేపు పర్యటించి పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.


