News August 7, 2024

అందరూ బౌలింగ్ చేస్తున్నారు సరే.. మరి బ్యాటింగ్?

image

కోచ్‌‌గా గంభీర్ హయాంలో భారత జట్టులో కొన్ని మార్పులు వచ్చాయి. ఆల్‌రౌండర్లతోనే కాక రోహిత్, గిల్, సూర్య, రింకూ వంటి బ్యాటర్లతోనూ బౌలింగ్ వేయిస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ బలమైన బ్యాటింగ్‌కు మారుపేరైన భారత్ శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో 231, 241 రన్స్ ఛేదించలేక ఓడింది. రోహిత్ మినహా ఎవరూ రాణించట్లేదు. అందుకే బౌలర్లూ మినిమం బ్యాటింగ్ చేసేలా చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?

Similar News

News March 4, 2026

ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

image

TG: నాగర్‌కర్నూల్‌లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) ఈనెల 2న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.

News March 4, 2026

జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

image

ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు వ్యాప్తంగా ప్రారంభించింది. గత 7 నెలలుగా కోరమంగళ, HSR లేఅవుట్ వంటి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్ల నుంచి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తుంటే ‘ఓన్లీ’ మాత్రం వారి నుంచి ₹400 కంటే తక్కువ ఆర్డర్లకు ₹25, ఎక్కువ వాటికి ₹50 ఫిక్స్‌డ్ ఫీజు కలెక్ట్ చేయనుంది.

News March 4, 2026

శ్రీకాకుళం జిల్లాలో 13 ఉద్యోగాలు

image

శ్రీకాకుళం జిల్లా స్త్రీ&శిశు సంక్షేమం శాఖ, వన్ స్టాప్ సెంటర్‌లో 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సిలర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ తదితర పోస్టులు ఉన్నాయి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: srikakulam.ap.gov.in/