News August 7, 2024

వరంగల్ నుండి మేడారం వరకు గ్రీన్ కారిడార్: మంత్రి

image

హరిత నిధి పురోగతి అంశంపై నేడు సచివాలయంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. హరితనిధి నిధులతో వరంగల్, ములుగు డీఎఫ్ఓల అధికార పరిధిలో వరంగల్ నగరం నుంచి మేడారం వరకు మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, మీడియన్ ప్లాంటేషన్‌ను చేపట్టేందుకు స్టేట్ లెవల్ కమిటీ ఆమోదం తెలిపింది. హరితనిధి ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 14, 2026

WGL: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరుగుదల

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతింటుందనే ఆందోళనతో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరిలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్‌లు ఉండగా, శుక్రవారం ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా అవసరమైన వారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. సరఫరాలో అంతరాయం లేదని, అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని అధికారులు తెలిపారు.

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.

News March 13, 2026

మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

image

SIR మ్యాపింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (RDO)ను కలెక్టర్ ఆదేశించారు.