News August 7, 2024
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఆగస్టు 7, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:40 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:46 గంటలకు
✒ ఇష: రాత్రి 8.03 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 14, 2026
నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.
News March 14, 2026
NHPCలో 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు

NHPC లిమిటెడ్ 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో BE/BTech/BSE పూర్తి చేసి 60% మార్కులున్న వారు, MAR 16-APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. GATE 2024/GATE 2025 మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూతో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.50k- రూ.1.60 లక్షల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు www.nhpcindia.com చూడండి.
News March 14, 2026
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి?

సూర్యుడిని దర్శించుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత ఎడమ నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇవి పూర్తయ్యాక తిరిగి కుడివైపు నుంచి ఎడమవైపునకు రాహువు, కేతువులను స్మరిస్తూ మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. చివరగా ఒక్కొక్క గ్రహం పేరు తలుచుకుంటూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా శాస్త్రోక్తంగా నియమాలను పాటిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అశేషమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.


