News August 7, 2024

మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే EWS కోటా అమలు

image

AP: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే EWS కోటాలో 10శాతం సీట్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని విద్యాసంస్థల్లోనే అమలు చేసినా NMC ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తించదని అధికారులు తెలిపారు.

Similar News

News November 7, 2025

నాకు విజయ్‌తో శత్రుత్వం లేదు: అజిత్

image

కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్‌పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్‌తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్‌కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

News November 7, 2025

లావెండర్ నూనెతో మేనికి మెరుపు

image

అందాన్ని పెంచడంలో ఎసెన్షియల్ ఆయిల్స్ కీలకంగా పనిచేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది లావెండర్ ఆయిల్. దీన్ని ఎలా వాడాలంటే..* 2చుక్కల లావెండర్ నూనెని పావుకప్పు బ్రౌన్ షుగర్‌లో కలిపి, స్నానం చేసేముందు ఒంటికి రుద్దుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలు, యాక్నేను తగ్గిస్తుంది. * అరటిపండు గుజ్జు, తేనె, 2చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.

News November 7, 2025

264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.