News August 7, 2024
ఇంటర్ విద్యార్థులపై తగ్గనున్న పాఠాల భారం!

TG: NCERT ప్రణాళిక అనుగుణంగా విద్యార్థులపై పాఠాల భారం తగ్గించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సబ్జెక్టుల నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 2025-26 నుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కెమిస్ట్రీలో 10-15% పాఠ్యాంశాలు తగ్గుతాయని, MECకి ప్రత్యేక మ్యాథ్స్ పుస్తకం, బైపీసీ సబ్జెక్టుల్లో మార్పులు జరిగే అవకాశముందని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్‌డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.
News September 19, 2025
23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<