News August 7, 2024

బోడ కాకరకాయ తిన్నారా?

image

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో పోషకాలు ఉండే బోడ కాకరకాయలకు డిమాండ్ ఉంటుంది. పొట్టిగా, గుండ్రంగా ఉంటూ పైన చిన్నచిన్న ముళ్లు ఉంటాయి. అడవిలో పెరిగే ఈ తీగలు వానాకాలం తర్వాత ఎండిపోతాయి. గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్లి కోసుకొచ్చి ఉపాధి పొందుతారు. ప్రస్తుతం కేజీ రూ.300పైనే పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని అడవి కాకర, ఆకాకరకాయ అని పిలుస్తారు. మరి ఈ సీజన్లో బోడకాకరకాయ కూర తిన్నారా? కామెంట్ చేయండి.

Similar News

News January 16, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 16, 2025

చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా: అనిల్ రావిపూడి

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News January 16, 2025

15 నెలల యుద్ధానికి ముగింపు!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. 2023 అక్టోబర్ 3న ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడితో హమాస్ ఈ యుద్ధానికి తెరలేపింది. ఈ దాడిలో 1,200 మందికిపైగా పౌరులను ఇజ్రాయెల్ కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటివరకు 46,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించగా సుమారు లక్ష మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.