News August 7, 2024
జనగామ: ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి!

మారు వేషంలో వచ్చిన బంగారు లేడిని శ్రీరాముడు పట్టుకునే సమయంలో శ్రీ రామచంద్రస్వామి ఆలయం ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం జీడికల్ గ్రామంలో ఉంది. గుడి సమీపంలో ఉన్న కోనేరులో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఏటా శ్రీరామనవమి, కార్తీక మాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. దీనిని రెండో భద్రాద్రి అని పిలుస్తారు. ఈ ఆలయం పేరిట గుంటూరులో 11 ఎకరాల భూమి ఉండటం విశేషం.
Similar News
News March 14, 2026
మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.
News March 14, 2026
WGL: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరుగుదల

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతింటుందనే ఆందోళనతో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరిలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్‌లు ఉండగా, శుక్రవారం ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా అవసరమైన వారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. సరఫరాలో అంతరాయం లేదని, అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని అధికారులు తెలిపారు.
News March 14, 2026
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.


