News August 7, 2024
చీరాలలో యువకుడి దారుణ హత్య

బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
Similar News
News March 18, 2026
ఒంగోలు: దివ్యాంగుల సాధికారతకు ‘శక్తి’ పథకం ప్రారంభం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగుల భరోసా కోసం ‘శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, శిక్షణ, సామాజిక మద్దతు అందించి వారిని స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించనున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని దివ్యాంగుల స్వావలంబనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
News March 18, 2026
తాళ్లూరు: లేఔట్లను పరిశీలించిన జేసీ

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. లేఅవుట్ అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉన్న పలు సర్వే నంబర్లలోని భూములను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును తనిఖీ చేశారు. ఈ పర్యటనలో అద్దంకి ఆర్డీవోతో పాటు పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
News March 18, 2026
ప్రకాశ: విద్యుత్ వినియోగదారులకు ఎస్ఈ సూచనలు

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. గడువు లోపు చెల్లిస్తే సర్ ఛార్జ్, పెనాల్టీ పడదని అన్నారు. జిల్లాలో కోట్ల రూపాయల మేర బిల్లు బకాయిలు విద్యుత్ సంస్థకు పెనుభారంగా మారాయని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చు అని తెలిపారు.


