News August 7, 2024
ప.గో. జిల్లాలో నేషనల్ హైవే

ప.గో. జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నుంచి భీమవరం మీదుగా తాడేపల్లిగూడెం- నిడదవోలు – విజ్జేశ్వరం మీదుగా కొవ్వూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి DPR పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. పేరుపాలెం బీచ్ నుంచి తాడేపల్లిగూడెం వరకు 2 వరసల రహదారి నిర్మించాలన్నది ప్రజల కోరిక. ఈ రహదారిని జాతీయరహదారిగా గుర్తించి అభివృద్ధి చేస్తే తీరప్రాంత గ్రామాల్లో ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది.
Similar News
News September 18, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.
News September 18, 2025
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. జేసీ హెచ్చరిక

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పీజీఆర్ఎస్, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా మాట్లాడి పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
News September 17, 2025
ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.