News August 7, 2024
నేటి నుంచే శుభ ముహూర్తాలు
మూడు నెలల తర్వాత నేటి నుంచి శుభ <<13779135>>ముహూర్తాలు<<>> మొదలయ్యాయి. ప్రస్తుతం శ్రావణమాసం కొనసాగుతుండటంతో శుభకార్యాలు ఎక్కువగా జరగనున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, భూమి పూజలు, బారసాలలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, షామియానాలు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండు మేళాలకు గిరాకీ పెరిగింది.
Similar News
News January 16, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 16, 2025
చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా: అనిల్ రావిపూడి
‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
News January 16, 2025
15 నెలల యుద్ధానికి ముగింపు!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. 2023 అక్టోబర్ 3న ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడితో హమాస్ ఈ యుద్ధానికి తెరలేపింది. ఈ దాడిలో 1,200 మందికిపైగా పౌరులను ఇజ్రాయెల్ కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటివరకు 46,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించగా సుమారు లక్ష మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.