News August 7, 2024
ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్న కూటమి: బొత్స

విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తుందని ఆరోపించారు. గత వైసీపీ ఎన్నికలలో టీడీపీ కేవలం 50 ఓట్లు మెజార్టీ ఉండడంతో వైసీపీ పోటీ చేయలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు వైసీపీ 400 ఓట్ల మెజార్టీ ఉందన్నారు.
Similar News
News January 21, 2026
మాతృ మరణాల నివారణకు పకడ్బందీ చర్యలు: DMHO

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమావేశం జరిగింది. మూడు నెలల్లో నమోదైన మాతృ మరణాలపై ఆయన చర్చించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్, వీజీహెచ్‌కు పంపాలని, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
News January 21, 2026
విశాఖలో DSPCA సమావేశం

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అధ్యక్షతన జిల్లా జంతు క్రూరత్వ నివారణ కమిటీ (DSPCA) సమావేశం జరిగింది. వీధి కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC), సింహాచలం దేవస్థాన కోడెల సంరక్షణపై సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు.
News January 21, 2026
విశాఖ: ‘రోజుకు 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి’

పేదల గృహ నిర్మాణాల పరిస్థితిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హౌసింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లతో సమీక్ష చేసి ఏఏ ప్రాంతాల్లో నిర్మాణాలు ఏ మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. రోజుకు 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.


