News August 7, 2024
చీరాలలో యువకుడి దారుణ హత్య

బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
Similar News
News March 14, 2026
ఉమ్మడి ప్రకాశం: 10th విద్యార్థులకు SP సూచన

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 108 కేంద్రాల్లో 10 పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు సజావుగా జరిగేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏవైనా ఘటనలు జరిగితే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
News March 14, 2026
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.
News March 14, 2026
కనిగిరి: పాపం.. ఈ కష్టం ఏ తల్లికీ రాకూడదు..!

ఇటీవల S.కొండలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పద స్థితిలో కనిగిరికి చెందిన తౌషిక్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తౌషిక్ తల్లి మౌలాబి శుక్రవారం కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయిందని బంధువులు ఆందోళన చెందారు. సాయంత్రం వేళలో శ్మశానవాటికలోని తౌషిక్ సమాధి వద్ద పడుకొని ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు ఆమెను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.


