News August 7, 2024
నిందితులకు శిక్ష పడాల్సిందే: మెదక్ SP

నిందితులకు శిక్షపడేలా కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది కృషి చేయాలని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందికి DGP నిన్న ప్రశంసా పత్రాలు అందజేశారు. SP మాట్లాడుతూ.. 2023లో హత్య కేసులో రామాయంపేట CI చంద్రశేఖర్, 2021లో మరో కేసులో తూప్రాన్ DSP కిరణ్ కుమార్.. నిందితులకు శిక్ష పడేలా చేశారు. నేర రహిత సమాజం కోసం నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పనిచేయాలన్నారు.
Similar News
News September 17, 2025
మెదక్: కలెక్టరేట్ త్రివర్ణమయం

17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్ మూడు రంగుల విద్యుత్ దీపాలతో త్రివర్ణ మయంగా ముస్తాబు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
News September 16, 2025
నర్సాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు పరిశీలించారు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.
News September 16, 2025
మెదక్: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డికి 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా, ఇటీవల రాష్ట్ర హై కోర్టు 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తు 3 నెలలో అమలు చేయాలని స్పష్టంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మాడవేడి వినోద్ కుమార్, ఇమ్మడి సంతోశ్ కుమార్ తదితరులున్నారు.