News August 7, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని లేఖ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ప్లాంట్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తులు, మానవ వనరులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలు భవిష్యత్తులో జాతీయ ప్రయోజనాలపై ప్రభావం చూపుతాయని అన్నారు.
Similar News
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
News July 9, 2025
‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.