News August 7, 2024

నా సొంత డబ్బులు రైతులకు కట్టా: ఎంపీ

image

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పుంగనూరు ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ నిర్మాణంలో రైతులు నష్టపోకుండా తమ సొంత నిధులు రూ.1.49 కోట్లను నష్టపరిహారంగా చెల్లించామని గుర్తించారు. టీడీపీ కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకుందన్నారు.

Similar News

News September 14, 2025

పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

image

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 13, 2025

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

image

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News September 13, 2025

బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

image

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్‌ల కేటాయింపు జరుగుతుందన్నారు.