News August 7, 2024
జూరాలకు 2.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కృష్ణా నదిలో వరద కొనసాగుతుంది. జూరాల 30 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2.49 లక్షల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 2.35లక్షల క్యూసెక్కులుగా ఉంది. 9.65TMCలకు 9.09TMCల నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తారు. స్పిల్ వే ద్వారా 3.11 లక్షల క్యూసెక్కులు వదులుతుండగా.. ఇన్‌ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 205 TMCల నిల్వ ఉంది. సాగర్‌లో 20గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
మహబూబ్‌నగర్: 254 మంది విద్యార్థులు గైర్హాజరు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మ్యాథమెటిక్స్ జువాలజీ హిస్టరీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 254 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నేటి పరీక్షకు మొత్తంగా 10,156 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,902 విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష సందర్భంగా ఇటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
News March 5, 2026
పాలమూరు: GOVT పథకాలపై వర్క్ షాప్

మహబూబ్ నగర్ లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమ శాఖ అధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమన్నారు. SBI,RSETI సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, యువజన అధికారి కోటా నాయక్, శిక్షణ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News March 4, 2026
మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ!

మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.


