News August 7, 2024

50వేలమంది ఉద్యోగులకు 10రోజుల ‘వెకేషన్’!

image

గుజరాత్‌కు చెందిన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సంస్థలోని 50వేలమందికి ఈ నెల 17 నుంచి 27 వరకు 10 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు గిరాకీ తగ్గిందని, ఉత్పత్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యజమాని వల్లభ్‌భాయ్ లఖానీ తెలిపారు. సహజ వజ్రాల ఉత్పత్తిదారుల్లో తమదే అతి పెద్ద సంస్థ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 31, 2026

హైకోర్టులో అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో సహా 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె తెలిపారు. 24 గంటలపాటు తమకు భద్రత కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.

News January 31, 2026

పాక్ ఆర్మీ కల్నల్ హత్య.. పహల్గామ్ దాడిలో ఇతడి హస్తం?

image

పాకిస్థానీ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ హతమయ్యాడు. జనవరి 28న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో గుర్తు తెలియని గన్‌మెన్లు చంపేశారు. అతడి కారుకు బుల్లెట్లతో తూట్లు పొడిచారు. 2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌లో ఇమ్రాన్ హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టెర్రరిస్టులకు హ్యాండ్లర్‌గా ఇతడు వ్యవహరించినట్లు సమాచారం.

News January 31, 2026

అంబటి రాంబాబుకు ఫోన్‌ చేసిన YS జగన్‌

image

AP: YCP నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి <<19014952>>ఘటన<<>>పై పార్టీ అధినేత, మాజీ CM వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అంబటికి ఫోన్‌ చేసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే విధంగా రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిందని, చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని ట్వీట్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.