News August 7, 2024

కలెక్షన్లలో ‘కల్కి’ సినిమా మరో రికార్డు

image

అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ నాలుగో స్థానానికి చేరింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 40 రోజుల్లో రూ.640.6కోట్లు వసూలు చేసి షారుఖ్‌ఖాన్ ‘జవాన్'(రూ.640.25కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. బాహుబలి-2 (రూ.1030.42cr), కేజీఎఫ్-2 (రూ.859.7cr), RRR (రూ.782.2cr) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News March 16, 2026

కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

image

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.

News March 16, 2026

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. SKLM, VZM, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
– ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.

News March 16, 2026

నటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోయిన సిద్ధార్థ్

image

నటి ప్రత్యూష డెత్ <<19164468>>కేసులో<<>> నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని 4 వారాల క్రితం తీర్పునిచ్చింది. దీంతో అతడు ఈరోజు లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.