News August 7, 2024
చిరుద్యోగులపై కూటమి ప్రతాపం: YCP
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల పొట్ట కొడుతోందని వైసీపీ ఆరోపించింది. అంగన్‌వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నైట్ వాచ్‌మెన్లు, డీలర్లను లక్షలాదిగా తొలగిస్తోందని మండిపడింది. ‘ఖాళీ అయిన స్థానాల్లో లంచాలు తీసుకుని తమకు అనుకూలమైనవారిని నియమిస్తోంది. కూటమి నేతల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొంది.
Similar News
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.
News January 16, 2025
ఆరు వారాలే ఒప్పందం!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.
News January 16, 2025
జనవరి 16: చరిత్రలో ఈ రోజు
1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి జననం
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం