News August 7, 2024
HYD: గాంధీ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి!
గాంధీలో సమస్యలు వెంటాడుతున్నాయి. డాక్టర్లు, మందుల కొరతతో పాటు OP వార్డ్‌లో ఈసీజీ మిషన్ కూడా లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎక్స్ రే, MRI స్కాన్ల కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని పేషెంట్లు వాపోతున్నారు. కనీస మందులు కూడా లేకపోవడం గమనార్హం. మందుల కొరత కారణంగా సగం బయట కొనాల్సి వస్తోందని పేషెంట్లు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేట్ మెడికల్ షాపులు ఏంటని పేదలు నిలదీస్తున్నారు.
Similar News
News November 28, 2024
HYD: జంతువుల వెచ్చదనానికి ఏర్పాట్లు
సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.
News November 28, 2024
HYDలో మరో ముఠా.. ప్రజలు జాగ్రత్త..!
HYD ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా వచ్చిందన్నారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు బట్టలు అమ్మేవారిగా, చౌకైన వస్తువులను విక్రయించే వారిగా కాలనీల్లోని గృహాలు, షాపుల్లో రెక్కీ నిర్వహిస్తారని శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
News November 27, 2024
జియో ఫిజిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియో ఫిజిక్స్‌లో ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘గ్రావిటీ సర్వేస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులను తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.