News August 7, 2024
విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సమీక్ష

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి మయూర్ అశోక్ సూచించారు. బుధవారం పలువురి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
Similar News
News February 13, 2026
విశాఖ: రేపు పాఠశాలల సెలవు రద్దు

జిల్లాలో ఫిబ్రవరి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నెలకొన్న ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో ఒక రోజు సెలవు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.
News February 13, 2026
గంగవరం పోర్టులో కనీసం బ్రేక్ వాటర్ నిర్మించండి: ఎమ్మెల్యే పల్లా

గంగవరం పోర్టు ఏర్పడిన తర్వాత ఇక్కడ జెట్టీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జెట్టీ లేక ఇక్కడి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. కనీసం బ్రేక్ వాటర్‌ను అయినా నిర్మించి స్థానిక మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.


