News August 7, 2024
రైల్వేకోడూరు: లారీ బైక్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

రైల్వేకోడూరు- మైసూరు వారిపల్లి దగ్గర బైక్‌లో వస్తున్న వ్యక్తి లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుని పేరు కిరణ్ కుమార్ రెడ్డి(23) అని ఇతను కోడూరు నుంచి మాధవరంపోడుకు వళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్లియర్ చేసి కేసు నమోదు చేశారు.
Similar News
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.

MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.