News August 7, 2024

HATSOFF: అవయవ దాతలకు ఆ రాష్ట్రాల గౌరవం

image

తాను లేకపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగపడాలనే ఆలోచన అత్యున్నతమైనది. అలాంటి ఉన్నత మార్గాన్ని ఎంచుకున్నవారికి దక్కే గౌరవం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. అందుకే తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు?

Similar News

News December 27, 2024

టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

image

TG: తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. హాల్ టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 27, 2024

నిజాయితీ, నిరాడంబరతే మన్మోహన్ కిరీటాలు

image

మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నిజాయితీ, నిరాడంబర జీవితాన్ని గడిపారు. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రత్యర్థుల మన్ననలు సైతం పొందారు. ప్రజా జీవితంలో పాటించాల్సిన విలువలకు ఆయన నిదర్శనంగా నిలిచారు. ఎవరిపైనా చిన్న దూషణ, తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఆర్థిక, పాలనా అంశాల్లో సమగ్రమైన అవగాహనతో ఆయన పార్లమెంట్ సహా పలు వేదికల్లో చేసిన ప్రసంగాలు ఎంతో మందికి పాఠ్యపుస్తకాల్లాంటివి.

News December 27, 2024

రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్

image

ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.