News August 7, 2024
రష్మిక గురించి మీకు ఈ విషయం తెలుసా?

హీరోయిన్ రష్మికకు ఓ చిన్ని చెల్లి ఉంది. ఆమె పేరు షిమన్ మందన్న. వారిద్దరి మధ్య వయసు తేడా 16 ఏళ్లు. రష్మిక ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ ‘ఏజ్ గ్యాప్ వల్ల నాకు, నా చెల్లికి గొడవలు ఉండవు. తనని తల్లిలా చూసుకుంటా. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయింది. అప్పటినుంచి తనతో 4 నెలలు మాత్రమే గడిపా. తను కూర్గ్(కర్ణాటక)లో ఉంటుంది. షూటింగ్స్ వల్ల కలవడం కుదరట్లేదు. వీడియో కాల్స్ చేస్తుంటా’ అని చెప్పారు.
Similar News
News March 21, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.
News March 21, 2026
బాంబుల మోత మధ్య పండుగ!

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
News March 21, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?


