News August 7, 2024

వచ్చే ఏడాదే నా పెళ్లి: నటి

image

వచ్చే ఏడాది తాను పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నటి ప్రియా భవానీ శంకర్ తెలిపారు. ‘రాజ్‌తో పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నా. వివాహం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ సమయం దొరకక కుదరటం లేదు. వచ్చే ఏడాది తప్పకుండా ఏడడుగులు నడుస్తాం’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా నాగచైతన్య సరసన ‘ధూత’ వెబ్‌సిరీస్‌లో ప్రియా నటించారు. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు2’ లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.

Similar News

News January 12, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ రివ్యూ & రేటింగ్

image

విడిపోయిన భార్యాభర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది. చిరు-వెంకీ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రెగ్యులర్ స్టోరీ, ముందే ఊహించగల కొన్ని సీన్లు మైనస్.
రేటింగ్: 3/5

News January 12, 2026

చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్లు

image

AP: చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. DECలో ఆప్కో బకాయిల్లో రూ.2.42 కోట్లు చెల్లించారు. సంక్రాంతి సందర్భంగా మరో రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించామన్నారు.

News January 12, 2026

వచ్చే వారం ఇన్వెస్టర్ల ముందుకు ఆరు IPOలు

image

ఈ నెల 12 నుంచి 16 వరకు మార్కెట్‌కు ఆరు IPOలు రానున్నాయి. వీటిలో అమాగీ మీడియా ల్యాబ్స్ ఒక్కటే మెయిన్ బోర్డ్ ఐపీఓ కాగా, మిగతా ఐదు ఎస్‌ఎంఈ (Small and Medium Enterprises) విభాగానికి చెందినవే. అమాగీ ఐపీఓ జనవరి 13న ప్రారంభమై 16న ముగియనుంది. షేరు ధర రూ.343-361 మధ్య ఉండగా రూ.1,789 కోట్లు సమీకరించనుంది. ఇదిలా ఉండగా శుక్రవారం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన భారత్ కోకింగ్ కోల్ ఐపీఓకు భారీ స్పందన లభిస్తోంది.