News August 7, 2024
జగన్ బొమ్మ ఉన్న పాసు పుస్తకాలు వెనక్కి

AP: సర్వేరాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ ఫొటోతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పాస్ బుక్‌లు పంపిణీ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News January 9, 2026
చిరంజీవి సినిమా.. టికెట్ రేట్ల పెంపు

AP: చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది. జనవరి 12 నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.120 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
News January 9, 2026
VIRAL PHOTO: కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న కోహ్లీ!

న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనను చూడటానికి వచ్చిన అభిమానులకు ఆయన ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. వారిలో ఓ చిన్నారి అచ్చం యంగ్ కోహ్లీలానే కనిపించాడు. దీంతో ‘యంగ్ కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీనియర్ కోహ్లీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం నుంచి NZతో 3 ODIల సిరీస్ ప్రారంభం కానుంది.


