News August 7, 2024
కృష్ణా జిల్లాలో PACSల బలోపేతానికి చర్యలు: కలెక్టర్

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా PACSల కంప్యూటరీకరణ, PACSలలో విద్యుత్, హార్డ్వేర్, PM కిసాన్ సమృద్ధి కేంద్రాలు తదితర అంశాలపై సమీక్షించారు.
Similar News
News March 18, 2026
కృష్ణా: గ్యాస్ సరఫరాలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-242493కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు.
News March 18, 2026
రేపు మచిలీపట్నంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఈ నెల 19వ తేదీన మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారన్నారు. ఈ వేడుకలకు ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొంటారన్నారు.
News March 18, 2026
కృష్ణా: స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి మున్సిపాలిటీలు

పురపాలక సంఘాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లాలో మొత్తం ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉంది. గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగకపోవడంతో అక్కడ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. మచిలీపట్నం కార్పొరేషన్, పెడన మున్సిపాలిటీ, ఉయ్యూరు నగర పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది.


