News August 7, 2024

ఘోర ఓటమి.. 27 ఏళ్ల తర్వాత సిరీస్ కోల్పోయిన భారత్

image

శ్రీలంకతో చివరి వన్డేలో భారత్ 110 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 249 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన IND 138 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ 35, సుందర్ 30, కోహ్లీ 20, పరాగ్ 15 రన్స్ మినహా మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో వెల్లలగే 5 వికెట్లతో చెలరేగారు. ఈ ఓటమితో భారత్ 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. కాగా 27 ఏళ్ల తర్వాత లంకపై భారత్ సిరీస్‌ను మిస్ చేసుకుంది.

Similar News

News November 9, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్‌లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.

News November 9, 2025

చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

image

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in