News August 7, 2024

అనర్హత వేటు.. తొలిసారి స్పందించిన వినేశ్ ఫొగట్

image

పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు పడటంపై భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ తొలిసారి స్పందించారు. ‘ఇది చాలా బాధాకరం. మనం మెడల్ పోగొట్టుకున్నాం. కానీ ఇది ఆటలో భాగం’ అని తనను కలిసిన భారత రెజ్లింగ్ కోచ్ వీరేందర్ దహియా, ఇతర సిబ్బందితో వినేశ్ అన్నారు. అటు వినేశ్ ఫొగట్‌పై వేటు పడటంతో తామంతా షాక్‌కు గురైనట్లు వీరేందర్ దహియా పేర్కొన్నారు. కాగా అస్వస్థతకు గురైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు.

Similar News

News January 16, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం.

News January 16, 2025

గిరిజన రైతులకు గుడ్ న్యూస్

image

TG: ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ ₹6Lగా నిర్ణయించింది. ఈ స్కీమ్‌ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40% నిధులు రానున్నాయి.

News January 16, 2025

BREAKING: సైఫ్ అలీఖాన్‌పై దాడి

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.