News August 7, 2024
రైల్వే మంత్రి అశ్విన్‌ను కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రిని ఎంపీ కలిసారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖ అందించారు. అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను అందులో వివరించారు.
Similar News
News March 5, 2026
నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం

వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి ఇప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరు కుంట వద్ద భోజనం చేసిన తాగునీటి కోసం బావిలోకి దిగిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
News March 5, 2026
నెల్లూరు: హైవేపై ప్రమాదం

మనుబోలులోని ఆంధ్ర విలాస్ హోటల్ ఎదురుగా హైవేపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జట్లకొండూరుకు చెందిన పెంచలయ్య ఓ గ్రానైట్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. పని మీద సొంత ఊరు నుంచి మనుబోలుకు బైకుపై వస్తుండగా అదే సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల ఆటో ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.
News March 4, 2026
నెల్లూరు: మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.


