News August 7, 2024

బంగ్లాలో సంక్షోభం.. టెక్స్‌టైల్ ఎగుమతులపై ప్రభావం?

image

బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు అక్కడి ఎగుమతులపై ప్రభావం చూపనున్నాయి. ఈక్రమంలో ప్రధాన వస్త్రాల ఎగుమతిదారుగా బంగ్లా ఉండటంతో ఈ వ్యాపారాన్ని భారత్‌కు తీసుకొచ్చేలా ప్లాన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండియా FY 2024లో 34.43 బిలియన్ల వస్త్రాలను ఎగుమతి చేసింది. తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, UP, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. AP 0.46 బిలియన్ల వస్త్రాలను ఎగుమతి చేసింది.

Similar News

News April 10, 2026

ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్.. కేంద్రం చర్యలు!

image

గ్యాస్ కొరత కారణంగా దేశంలో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో 40% డిమాండ్ పెరగొచ్చని, అందుకు అదనంగా 27GW విద్యుత్ అవసరం పడుతుందని భావిస్తోంది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఇండక్షన్ స్టవ్ కంపెనీలతో చర్చిస్తోంది. అలాగే విద్యుదుత్పత్తి విషయంలోనూ చర్యలకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడటంతో ప్రజలు భారీగా ఇండక్షన్ స్టవ్‌లు కొంటున్నారు.

News April 10, 2026

భారీగా పెరగనున్న భూముల మార్కెట్ విలువ!

image

TG: త్వరలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగనుంది. 20% పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక HMDA ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది.

News April 10, 2026

యూత్‌లో గుండె జబ్బులు.. భారంగా మారుతున్న ఇన్సూరెన్స్!

image

గతంలో 50 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఎక్కువని భావించి ప్రీమియం ధరలను 50% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్లమ్ సంస్థ డేటా వెల్లడించింది. అంటే గతంలో కంటే ఇప్పుడు పాలసీ కోసం ఎక్కువ డబ్బులు కట్టాలి. అందుకే సరైన టైమ్‌లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆస్పత్రి ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుందంటున్నారు.