News August 7, 2024

పెద్ద శంకరంపేట: కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

image

పెద్దశంకరంపేటలో మతిస్తిమితం లేని కుమారుడిని తండ్రి మద్యం మత్తులో రోకలితో కొట్టి చంపినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. పోలీసుల వివరాలు.. సాయిలు, భూమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమారుడు ప్రదీప్ (16) మానసిక వైకల్యంతో ఉన్నాడు. వైకల్యం భరించలేని తండ్రి మద్యం మత్తులో రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తాత పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News January 17, 2026

మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.

News January 17, 2026

మెదక్ మున్సిపాలిటీలు.. మహిళలకే పట్టం!

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా గర్జన వినిపించనుంది. ఛైర్‌పర్సన్ పీఠాలన్నీ మహిళలకే రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. మెదక్ స్థానం బీసీ మహిళకు దక్కగా.. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో ఆశావహుల సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News January 17, 2026

MDK: మున్సిపల్ ఎన్నికల పనుల నేపథ్యంలో ప్రజావాణి వాయిదా: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఈనెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు నాలుగు మున్సిపాలిటీ ఏరియాలలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే మిగతా మండలాలలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.