News August 8, 2024

పార్వతీపురం: ‘వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి’

image

వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేసి అందజేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల కార్యాచరణను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో తయారుచేయాలన్నారు. గ్రామస్థాయిలో కమిటీ గ్రామ ప్రణాళికను తయారుచేసి అమలుచేయాలని తెలిపారు.

Similar News

News March 7, 2026

కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి: VZM కలెక్టర్

image

ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్‌ను ఆదేశించారు.

News March 7, 2026

బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

image

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖ‌ను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్‌కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.

News March 7, 2026

జాతీయ స్థాయి బ్యాట్మింటన్ పోటీలకు బొబ్బిలి వాసులు

image

విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన రమేష్ , వాసు 35
ఏళ్ల కేటగిరిలో పాల్గొని విజేతలుగా నిలిచారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. వీరిని బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం సత్కరించి, అభినందించారు. బొబ్బిలికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.