News August 8, 2024
చిత్తూరు: లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్
జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గృహ నిర్మాణాలపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 22,125 గృహాల నిర్మాణాల పూర్తికి లబ్ధిదారులతో చర్చించి.. నిర్మాణాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను ప్రతి లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. డీఆర్‌డీఎ ద్వారా మహిళా సంఘ సభ్యులకు రుణాలు అందించేలా చూడాలన్నారు.
Similar News
News November 18, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం.. ఇద్దరిపై కేసు
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన పాపవినాశనం ఆవరణంలో అన్యమత ప్రచారానికి పాల్పడ్డ ఇద్దరు మహిళలపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాపవినాశనం వద్ద శంకరమ్మ, మీనాక్షి భక్తుల ముందే ఆదివారం ఓ మతానికి సంబంధించి పాటలకు రీల్స్ చేయడం పెను దుమారం రేపింది. దీంతో భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 18, 2024
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2024
గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు
గుర్రంకొండ ASI మోసెస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండో పట్టణ SI రవి కుమార్ తెలిపారు. ఏఎస్ఐ మోసెస్ 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ తనను పట్టించుకోకపోవడమే కాకుండా అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య ఎస్తర్ రాణి శనివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రామచంద్ర ఆదేశాలతో ఎస్ఐ విచారణ చేపట్టి ఏఎస్ఐపై కేసు చేశారు.