News August 8, 2024
సిల్వర్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన వినేశ్!

అధిక బరువు ఉన్నారనే కారణంతో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగట్ క్రీడా కోర్టు(CAS)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను ఫైనల్‌కు చేరడంతో సిల్వర్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. తనను ఎలిమినేట్ చేయడం సరికాదని పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై కోర్టు ఇవాళ ఉదయం తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే ఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో వినేశ్ రజతం అందుకునే అవకాశం ఉంది.
Similar News
News October 19, 2025
జనగణన-2027 కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్

దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 మధ్య 2 ఫేజుల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ షెడ్యూల్, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. తొలుత ప్రీటెస్టు సేకరణ చేపడతారు. ఫస్ట్ టైమ్ జనాభా లెక్కల్లో కులాల సమాచారాన్ని సేకరించనున్నారు. వ్యక్తిగత వివరాల్ని డిజిటల్‌గా అందించేందుకూ అవకాశం ఇస్తారు.
News October 19, 2025
Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 19, 2025
రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.