News August 8, 2024

ఒలింపిక్స్: నిరాశపరిచిన మీరాబాయి

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచారు. వెయిట్ లిఫ్టింగ్‌లో 49 కేజీల విభాగంలో ఆమె నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో మీరా రజతం గెలిచారు. మరోవైపు 3000m స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ 11వ స్థానంలో నిలిచారు.

Similar News

News March 3, 2026

BHELలో 47 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) 47అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com

News March 3, 2026

UAEలో ‘ప్యానిక్ బయ్యింగ్’.. ప్రభుత్వం భరోసా!

image

ఇరాన్ దాడుల నేపథ్యంలో UAEలో నీటి కొరత ఏర్పడొచ్చనే భయాందోళనలు మొదలయ్యాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో జనం సూపర్ మార్కెట్లకు పోటెత్తడంతో నిత్యావసరాలు, బాటిల్ వాటర్ షెల్ఫ్స్ ఖాళీ అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా నిలిచిపోతుందనే అనుమానాలే ఈ ‘ప్యానిక్ బయ్యింగ్’కు దారితీశాయి. అయితే దేశంలో 3నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని UAE ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

News March 3, 2026

పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు: సత్యరాజ్

image

విషయం లేనివారే సినిమా డైలాగులు చెబుతారని TVK చీఫ్ విజయ్‌ని ఉద్దేశించి నటుడు సత్యరాజ్ కామెంట్స్ చేశారు. ‘పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు’ అని విమర్శించారు. ఇక TNను మరో అయోధ్యగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సనాతన Vs ద్రావిడ సిద్ధాంతం మధ్యే పోటీ అని, స్టాలిన్ ఉన్నంతవరకు మతశక్తులకు చోటు ఉండదన్నారు.