News August 8, 2024
మహేశ్ బాబుతో సినిమా.. హరీశ్ శంకర్ ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘పోకిరి’ లాంటి సినిమా చేయాలని ఉందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ‘పోకిరి’ తనకు టెక్ట్స్ బుక్ వంటిదని చెప్పారు. ఇప్పటివరకూ మహేశ్‌కు స్టోరీ ఏమీ చెప్పలేదన్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్-రవితేజ కాంబినేషన్లో సినిమా తీయాలని ఉందని చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవని, తన స్టైల్ సినిమాలు చేస్తానని తెలిపారు.
Similar News
News March 21, 2026
భారత్ – ఐర్లాండ్ మధ్య 2 టీ20లు

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచులు ఆడనున్నట్లు పేర్కొంది. 2 టీ20లూ బెల్‌ఫాస్ట్(ఐర్లాండ్) వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్లీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జులై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య 5టీ20లు జరగనున్నాయి.
News March 21, 2026
పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్‌పేట్‌లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్‌పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 21, 2026
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ అదుపులో అభిషేక్ సింగ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. అతని సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. అభిషేక్ నుంచి BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డికి అతను 24 సార్లు మత్తుపదార్థాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.


