News August 8, 2024
వారి తప్పులను సరిదిద్దేందుకే మా ప్రయత్నం: సీతక్క

TG: గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామపంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988 కోట్లనే రిలీజ్ చేసిందని మీడియాతో చెప్పారు. మిగిలినవి పెండింగ్‌లో పెట్టిందన్నారు. BRS ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంపై హరీశ్ రావు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
Similar News
News October 18, 2025
APకి కొత్తగా 106 PG మెడికల్ సీట్లు: సత్యకుమార్ యాదవ్

AP: ప్రభుత్వ PG వైద్య విద్యలో అదనంగా 106 సీట్ల భర్తీకి NMC ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గైనిక్, పీడియాట్రిక్, ఎనస్థీషియా, రేడియాలజీ విభాగాల్లో ఈ సీట్లున్నాయి. ఇందులో 60 సీట్లు 5 కొత్త కాలేజీలకు వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం అదనపు సీట్ల మంజూరుకు ప్రతిపాదన పంపింది. దీనిపై మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు. దీంతో కొత్త మెడికల్ సీట్లు మంజూరయ్యాయి.
News October 18, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త!

ఇవాళ్టి నుంచి దీపావళి టపాసుల మోత మోగనుంది. ఈ సందర్భంగా పిల్లలపై పెద్దలు ఓ కన్నేసి ఉంచడం మేలు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్‌వి ధరించాలి. కాలికి చెప్పులు లేదా బూట్లు ధరించాలి. క్రాకర్స్‌ను చేతిలో పట్టుకుని కాల్చకుండా, సురక్షితమైన దూరం పాటించాలి. కాల్చిన లేదా సగం కాలిన టపాసులను ముట్టుకోకూడదు. వాటిపై నీరు పోసి పారేయాలి. గడ్డివాములు, గుడిసెల దగ్గర అస్సలు పేల్చకూడదు.
News October 18, 2025
68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్

TG: మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.