News August 8, 2024

నెల్లూరు: డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు శుభవార్త

image

జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ తెలిపారు. శిక్షణ సమయంలో భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో వివరాలు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు ఆఫీసు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News March 7, 2026

నెల్లూరు: బాలికకు మాయమాటలు చెప్పి..

image

VK పాడు(M)కు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI రఘునాథ్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు లవ్ చేస్తున్నానని చెప్పి యువకుడు తీసుకెళ్లిన ఘటనపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిన్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని ఉదయగిరి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాలికను పేరెంట్స్‌కు అప్పగించారు.

News March 7, 2026

నెల్లూరు మున్సిపల్ అధికారులు వార్నింగ్

image

నెల్లూరు నగరంలో రూ.44 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో, సుమారు 14,300 మంది మొండి బకాయిదారులకు లోక్ అదాలత్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలా 50% రాయితీ వస్తుందని ఆశించి పన్ను ఆపేయవద్దని, అలా చేస్తే ఇంటి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ బకాయిలు ఉన్న హోటళ్లు, మాల్స్, ఇండస్ట్రీలపై నిఘా పెట్టారు.

News March 7, 2026

నెల్లూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.16 లక్షల నగదు చోరీ

image

కొండాయపాలెం నందనవనానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి బీరువాలో ఉన్న రూ. 16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు చోరీకి గురైందని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసిస్టెంట్ శ్రీనివాసులు అనే వ్యక్తికి నగదుబీరువాలో ఉంచమని ఇచ్చారు. అనంతరం నిద్రపోయే లేచి చూడగా బీరువాలో నగదు, బంగారు, పార్కింగ్‌లో ఉన్న బైక్ కనపడలేదని అన్నారు. తన అసిస్టెంట్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.