News August 8, 2024

NLG: కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల సందడి

image

నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆ మనోహర దృశ్యాన్ని సెల్ఫోన్లలో బంధించడంతో పాటు సెల్ఫీలు దిగారు. కొత్త బ్రిడ్జి దగ్గర నుంచి శివాలయం వెంట విద్యుదుత్పత్తి కేంద్రం వరకు పర్యాటకులు బారులుతీరి ప్రకృతి అందాలను తిలకిస్తూ గడిపారు. కాగా సాగర్ జలాశయానికి బుధవారం రాత్రి 9 గంటలకు 3,51,844 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

Similar News

News March 13, 2026

వాడపల్లి కేసులో వివరణ కోరిన మానవ హక్కుల సంఘం

image

వాడపల్లి పోలీసుల కస్టడీలో గిరిజన యువకుడు సాయి సిద్ధుపై జరిగిన చిత్రహింసల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది రేవంత్ వెల్లడించారు.

News March 13, 2026

గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం: మంత్రి ఉత్తమ్

image

ఎల్పీజీ గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 288 కేసులు నమోదు చేశామన్నారు.

News March 13, 2026

సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

image

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.