News August 8, 2024

HYD నగరంలో ధూళి కణాలే అధికం.. జాగ్రత్త..!

image

HYD నగరం NACP లక్ష్యాలను సాధించడంలో సగటు పనితీరు కనబరిచిందని తెలిపింది. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి నగరం యావరేజ్ పర్ఫార్మెన్స్ సిటీస్ జాబితాలో చేరింది. HYD నగరంలో పార్టీక్యులేట్ మ్యాటర్ (ధూళికణాలు ) 2.5 ఉద్గారాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించింది. దేశంలో 100 స్కోర్ సాధించిన నగరాలు 4 ఉండగా..75 స్కోర్ సాధించిన నగరాల్లో 26 ఉన్నాయి.75 స్కోర్ సాధించిన లిస్టులో హైదరాబాద్ సైతం ఉంది.

Similar News

News November 6, 2025

‘అప్పుడే సింగూరును ఖాళీ చేస్తాం’

image

నగరానికి తాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం అందులోని నీటిని ఖాళీ చేయాలని నిపుణులు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాతే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తామని ఈఈ జైభీమ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రిపేరుకు సంబధించి అధికారులు పలువురు ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News November 6, 2025

బీఆర్ఎస్ పోరాటం.. కాంగ్రెస్ ఆరాటం.. బీజేపీ ప్రయత్నం

image

జూబ్లీహిల్స్ బై పోల్స్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తమ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటమే చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేబినెట్ మంత్రులందరికీ ప్రచారంలోకి దించి గెలవాలని ఆరాటపడుతోంది. వీరికితోడు బీజేపీ కూడా గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. మరి కృషి ఎవరి ఫలిస్తుందో 14 వరకు ఆగాల్సిందే.

News November 6, 2025

సిటీలో సజ్జనార్ మార్క్ పోలీసింగ్ షురూ

image

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మార్క్ పోలీసింగ్ మొదలైంది. ఎక్కడ.. ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించబోనని పోలీసు అధికారులనుద్దేశించి పేర్కొన్నారు. ‘‘కొన్ని పాత కేసుల విచారణలో నిర్లక్ష్యం వహించారు.. వాటిపై దృష్టి సారిస్తా. ముఖ్యంగా ఇన్ స్పెక్టర్లు తమ స్టేషన్ కు ఎక్కడో దూరంగా నివాసముంటే కుదరదు.. 15 కిలో పరిధిలోనే ఉండాలి’’ అని పేర్కొన్నారు. సమర్థవంతంగా పనిచేయాలని సమీక్షా సమావేశంలో సూచించారు.